చలికాలం తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..ఈ వ్యాధులు రావచ్చు..!

చలి కాలంలో ప్రజలు తురుచుగా చేసే అతి పెద్ద తప్పులలో ఒకటి తక్కువ నీరు తీసుకోవడం.. వాతావరణ చల్లగా ఉన్నప్పుడు చాలా మంది దాహం తక్కువగా ఉంటుంది. కానీ చలి కాలంలో తక్కువ నీరు తాగడం అనేది చాలా చెడ్డ అలవాటు అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వాతవరణంలో తేమ కారణంగా ఈ రోజుల్లో చాలా మందికి దాహంగా అనిపించదు. అలాంటి సమయంలో ప్రజలు తక్కువ నీటిని తాగుతారు. కానీ చల్లని రోజుల్లో మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరం.. తక్కువ నీటిని తాగడం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

మనిషి మెదడు ఆరోగ్యానికి నీరు కీలక పాత్ర పోషిస్తుందని, అలాగే మన శరీరాన్ని అనేక రుగ్మతల నుంచి కాపాడుతుందని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ మనీష్ కుమార్ తెలిపారు. చలి రోజుల్లో రోజూ కనీసం రెండున్నర లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట క్రమం తప్పకుండా ఒకటి నుంచి రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తారు. తద్వారీ మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 

నీరు మన శరీరంలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుందని, అందుకే ఇలాంటి సమయంలో క్రమం తప్పకుండా నీరు తాగాలని అన్నారు. మీరు ఈ రోజుల్లో తక్కువ నీరు తాగితే ఆక్సిజన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. మెదడు పనితీరుకు అంతరాయం కలిగించే టాక్సిన్లను బయటకు పంపే సామర్థ్యాన్ని నీరు కలిగి ఉంటుంది. మెదడు సరిగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరమని వైద్యులు అంటున్నారు. 

Leave a Comment