ఈ చిట్కాలతో జాండీస్‌కి చెక్..ఇలా చేసి చూడండి..!

జాండిస్ని హెపటైటిస్ అని కూడా పిలుస్తారు.ఈ వ్యాధితో ఇబ్బంది పడే వారి కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. కొన్ని ఆహారాలు మనకు దీని నుంచి   ఉపశమనం కలిగిస్తాయి.కొన్నిటిని తాగడం లేదా తినడం ద్వారా జాండిస్ తగ్గుతుంది. అవి మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. వేప ఆకు యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మన కాలేయం ఆరోగ్యంపై ఉండడానికి వేపాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ వ్యాధితో ఎవ్వరు అన్న ఇబ్బంది పడుతుంటే తేనెతో కలిపి వేపాకును ఒక వారం పాటు తినండి. మంచి ఫలితము ఉంటుంది.

చెరుకు రసం తీసుకోవడము వల్ల జీర్ణవ్యవస్థ మరియు కాలేయ ఉండటానికి ఉంటుంది. చెరకు రసం చాలా ప్రయోజనలను ఇస్తుంది. మాములుగా కామెర్లు ఉన్నప్పుడు చెరుకు పాలు తాగాలని డాక్టర్స్ కూడా చెపుతారు. టొమాటోస్‌లో లైకోపీన్ అనే పదార్థము ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్‌గా మన శరీరానికి ఉపయోగపడుతుంది. టమాటలను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల జాండిస్‌తో పోరాడటానికి పనికివస్తుంది.

విటమిన్ సి అధికంగా ఉన్న నిమ్మకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ కామెర్లకు మంచి మెడిసిన్ లాగా పని చేస్తుంది అని నిపుణులు కూడా అంటారు. ముల్లంగిలో హెపటైటిస్ని తగ్గించే గుణం ఉంది. తాజాగా, బాగా ఉండే ముల్లంగి యొక్క ఆకుల రసాన్ని ఉదయం నిద్రలేవగానే పరిగడుపున తీసుకొంటే చాలా మంచిది ఇలా కాకుండా కూడా ముల్లంగిని నేరుగా తీసుకోవచ్చు.

బార్లీ దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఒక టీస్పూన్ వేయించిన బార్లీ గింజలను నీటిలో వేసి బాగా మరిగించాలి. దీంతో తయారు చేసిన నీటిని తాగడము వల్ల కామెర్ల వ్యాధి చాలా వరకు తగ్గుతుంది. బొప్పాయి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, అందువలన ఇది కాలేయ ఆరోగ్యానికి రక్షణ. అందుకే శరీర వేడి పెరిగినప్పుడు, మరియు డెంగీ వ్యాధితో ఇబ్బంది పడే వారు కూడా బొప్పాయి పండు, ఆకులను తినమని డాక్టర్స్ కూడా చెపుతారు.పెరుగు కూడా మంచి ఆహారము ఈ జబ్బుకి. ఇది జీర్ణం అవ్వడానికి వరకు ఉపయోగ పడుతుంది. పెరుగు మీ కడుపు లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచడములో  సహాయపడుతుంది.

జాండిస్ ఉన్న వారు సరైన ఆహారము తీసుకుంటే   ఖచ్చితంగా త్వరగా కోలుకొనే అవకాశం చాలా వరకు ఉంది. అతి ముఖ్యంగా నూనె పదార్థాలు తీసుకోవడం పూర్తిగా మానేయాలి. మీ లివర్ ఎప్పుడైతే వీక్ గా ఉంటుందో అప్పుడు ఆయిల్ ఫుడ్స్ జీర్ణం చేసుకొనే శక్తి తగ్గిపోతుంది. అయితే ఫ్యాట్ ఫుడ్స్ ను నివారించడం మాత్రమే కాదు. మంచి ఆహారాన్ని తీసుకోవడం కూడా అవసరము.పైనాపిల్ మరో డిటాక్స్ పండు ఇది లివర్ సెల్స్ ను క్లీన్ చెయ్యడానికి బాగా ఉపయోగ పడుతుంది.

 

Leave a Comment