రెండు తలలు, మూడు చేతులతో.. అరుదైన శిశువు జననం..!

ఓ మహిళ అరురదైన శిశువుకు జన్మనిచ్చింది. రెండు తలలు, మూడు చేతులతో శిశువు జన్మించిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు జావ్రా గ్రామానికి చెందిన షాహీన్ అనే మహిళ పురుటి నొప్పులతో రత్లాం జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఆమెకు  వైద్యులు ఆపరేషన్ చేశారు.. 

అయితే పుట్టిన శిశువుకు రెండు తలలతో పాటు మూగు చేతులు ఉన్నాయి. డెలివరీకి ముందు సోనోగ్రఫీ చేయగా.. మహిళ కడుపులో కవలలు ఉన్నట్లు తెలిసింది. డెలివరీ అయ్యాక చూస్తూ ఒకే శిశువుకు రెండు తలలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్య భాషలో దీనిని ‘పాలీసెఫాలీ కండిషన్’ అంటారని డాక్టర్ బ్రిజేష్ లాహూటీ చెప్పారు. ప్రస్తుతం శిశువును ఇండోర్ లోని ఎంవై ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.  

 

Leave a Comment