శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం.. షాపులకు నిప్పు.. తీవ్ర ఉద్రిక్తత..!

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ సత్రం ముందు ఉన్న టీ షాప్ వద్ద వాటర్ బాటిల్ విషయంలో గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.. ఏం జరిగిందంటే.. స్థానికంగా ఉన్న ఓ సత్రం ముందు టీ దుకాణం ఉంది. అక్కడ వాటర్ బాటిల్ విషయంలో గొడవ జరిగింది. అక్కడ కన్నడ భక్తులకు, స్థానికులకు మధ్య మాటా మాటా పెరిగింది. ఈక్రమంలో స్థానికులు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. 

దీంతో గాయపడిన వ్యక్తిని వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక వాసిపై దాడిని కన్నడిలు జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆగ్రహంతో స్థానికంగా ఉన్న టీ షాపును ధ్వంసం చేశారు. ఆ షాపుకు నిప్పటించారు. ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పాతాళ గంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లలోని, తాత్కాలిక షాపులను పూర్తిగా ధ్వంసం చేశారు.. 

అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో పోలీసులు భారీగా మోహరించారు. 

Leave a Comment