ఓ వైపు బాధ్యతలు, మరో వైపు అమ్మతనం..!

ఓ వైపు బాధ్యతలు, మరో వైపు అమ్మతనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంది ఆ మహిళా కానిస్టేబుల్.. తన ఐదు నెలల బిడ్డను చంకనపెట్టుకుని విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ లో ప్రియాంక అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తోంది. 

ప్రియాంక తన ఆరు నెలల ప్రసూతి సెలవుల తర్వాత మార్చి 3న తిరిగి విధుల్లో చేరింది. అయితే ఆమెకు శుక్రవారం సెక్టర్ 15-23లో డ్యూటీ వేశారు. అక్కడ తన బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తోంది. ‘ నా కుమారుడు నన్ను విడిచి ఉండలేడు. నా భర్త, అత్తమామలు మహేంద్రఘర్ లో ఉన్నారు. నేను డ్యూటీ చేస్తున్న ప్రాంతం నా ఇంటికి చాలా దూరం.. పిల్లాడు ఏడిస్తే నా భర్త, కుటుంబ సభ్యులు నా వద్దకే తీసుకొస్తారు. అలాగే నాకు డ్యూటీ కూడా ముఖ్యం’ అని ప్రియాంక చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Leave a Comment