అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..!

ఆమె..జీవితంలో పాత్ర ఏదైనా, ఘట్టం ఏదైనా కామన్ గా ఉండేవి మాత్రం కష్టాలే…

ఆమె తల్లి కడుపు నుంచి బయట పడగానే.. అయ్యో ఆడపిల్ల అని కొందరంటే.. ఆడపిల్లనా అని దీర్ఘం తీసే వాళ్ళు ఇంకొందరు.. అసలు కడుపులోనే చంపేసే వాళ్ళూ లేకపోలేదు..

భూమి మీద పడినప్పటి నుండి ఆమె యుద్ధం మొదలవుతుంది..

ఒంటరిగా పాఠశాలకు వెళ్ళాలన్నా భయమే..

పాఠశాల వయసులోనే ఋతుస్రావం..ఇంక నెల నెలా రక్తపు ప్రవాహం, భరించలేని నొప్పి..

పెళ్లీడు రాగానే అలా ఉండాలి..ఇలా ఉండాలి..

పెళ్లి అయ్యాకా కూడా కొందరికి భర్త నుండి అవే పదాలు..

పిల్లలు లేకపోతే గొడ్రాలు అనే పదంతో సూటి పోటి మాటలు..

అన్నీ బాగుండి గర్భవతి అయితే 9 నెలలు బరువు మోయాల్సిందే…కొంచెం ఓపిక పడితే ఇంకో మనిషికి జన్మనిచ్చే గొప్ప ఛాన్స్…

పిల్లలు పుట్టాకా..ఇంక డైలీ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ.. ఆలన, పాలన, లాలన.. ముడ్డి కడగటం నుంచి గోరు ముద్దలు పెట్టే వరకూ అంతా తన పనే..

పిల్లలు పెద్దగయ్యాకా యమ్మయ్యా..బరువు తగ్గింది అనుకుంటే… ఎముకలు పెళుసు బడటం, రక్త హీనత, విటమిన్ లోపం, వగైరా వగైరా బలహీనతలు హత్తుకుపోతాయి..

కూర్చుని లేస్తే నొప్పి..దూరం నడిస్తే నొప్పి..నిలబడి పని చేస్తే నొప్పి.. వాటికి తోడు ఇంటి ఆస్తి షుగర్ ఫ్యాక్టరీ…చిన్న గాయమైనా పుండే..

అలా కష్టాల కడలి నుండి భూమి నుండి సెలవు తీసుకుంటే అప్పుడు కొంచెం విశ్రాంతి..కానీ ఆ విశ్రాంతిని ఫీల్ అవ్వడానికి మనిషీ ఉండదు..మనసూ ఉండదు…

ప్రతి స్త్రీ మూర్తికీ నా పాదాభివందనాలు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

 

Leave a Comment