కాటేసిన పాముతో ఆస్పత్రికి.. షాక్ అయిన డాక్టర్లు..!

చిన్నారిని ఓ పాము కాటేవేసింది. స్థానికులు ఆ పామును సంచిలో వేసుకుని చిన్నారితో సహా ఆస్పత్రికి వచ్చారు. ఈ ఘటన కర్ణాటకలోని డెంకణీకోట తాలుకా బయలకాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మణి కూతురు సంచనశ్రీ(5) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. 

ఆ సమయంలో ఆ చిన్నారిని చిన్న సైజు కట్ల పాము కాటేసింది. దీంతో ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ పామును వైద్యులకు చూపించడంతో అక్కడివారు షాక్ అయ్యారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని వైద్యులు తెలిపారు. 

Leave a Comment