ఎస్బీఐ కస్టమర్స్ కు అలర్ట్.. క్యాష్ విత్ డ్రాకు కొత్త రూల్స్..!

ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు ఎక్కువయ్యారు. క్షణాల్లో అకౌంట్ లోని డబ్బులను మాయం చేస్తున్నారు. దీంతో బ్యాంకులు కూడా అలర్ట్ అయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లు మోసాల బారినపడకుండా కొత్త పద్ధతిని తీసుకొచ్చింది.

ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్బీఐ. ఈ ఓటీపీ విధానం ద్వారా కస్టమర్లు మోసపోకుండా ఉంటారని ఎస్బీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలో ఎప్పటిలాగే పిన్ ఎంటర్ చేశాక కస్టమర్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే డబ్బులు తీసుకోగలము. ఎస్బీఐ 2020లోనే ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. తాజగా ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి ఓటీపీ ఆధారిత క్యాష్ విత్ డ్రాను ప్రవేశపెట్టింది. 

ఎస్బీఐ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్ కోసం ఓటీపీ ఆధారిత క్యాష్ విత్ డ్రా వ్యవస్థతో మోసగాళ్ల ఆగడాలకు చెక్ పెట్టొచ్చని, మోసాల నుంచి కస్టమర్లను కాపాడటం తమ బాధ్యత అని ఎస్బీఐ పేర్కొంది. ఇకపై ఏటీఎంలలో ఓటీపీ ఎంటర్ చేస్తేనే నగదు వస్తుంది. లేకపోతే నగదు తీసుకోలేరని ఎస్బీఐ తెలిపింది. అయితే ఎస్బీఐకి చెందిన ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు మాత్రమే ఈ సేవలు అందుతాయి. ఇతర ఏటీఎం నుంచి నగదు తీసుకుంటే ఓటీపీ నిబంధన వర్తించదు.. మీరు ఏటీఎంకు వెళ్లేటప్పుడు ఫోన్ తప్పనిసరిగా తీసుకెళ్లండి..   

Leave a Comment