రోజుకో అరటిపండుతో.. గుండెపై ఒత్తిడి, కిడ్నీ సమస్యలు దూరం..!

ప్రస్తుతం మారిన జీవన విధానం, తీసకునే ఆహారం గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. గతంలో గుండె జబ్బు వచ్చిందంటే.. వయసు మీద పడిన వారు ఉండేవారు. కానీ ప్రస్తుతం యుక్త వయసులోనూ గుండె జబ్బులు సాధారణం అయిపోయాయి. శరీరానికి తగిన వ్యాయామంతో పాటు మంచి ఆహారం గుండె పని తీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

అయితే గుండె జబ్బుల విషయంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రోజుకో అరటి పండు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని మూడో వంతు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ పొటాషియం ధమనులు మూసుకుపోకుండా చేస్తుంది. 

అరటి పండు తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అలబామా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఓ మీడియం సైజ్ అరటి పండు తినడం వల్ల శరీరానికి 9 శాతం పొటాషియం అందుతుంది. దీంతో రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ ఇది సహాయ పడుతుంది.

ఇక అరటి పండు కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండులో విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శక్తికి మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.  ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాలు తగ్గించడానికి కూడా అరటి పండు బాగా ఉపయోగపడుతుంది. అల్సర్ కారక యాసిడ్ లను ఉత్పత్తి చేయకుండా అరటి పండు నిరోధిస్తుంది. రక్తపోటు, రక్తహీనత సమస్యలు కూడా దూరమవుతాయి. గర్భిణీలు అరటి పండ్లు తీసుకోవడం ఎంతో మేలు. అరటి పండులో శరీరానికి అసరమయ్యే మాంగనీస్ 13 శాతం లభిస్తుంది. అయితే అరటి పండును రాత్రి పూట తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. 

Leave a Comment