90 వేల మంది యువతకు కరోనా..!

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు యువకులు, పదేళ్ల లోపు పిల్లలపై కరోనా ప్రభావం చూపింది. తాజాగా వయసుల వారీగా కరోనా బాధితుల నివేదికను వైద్య ఆరోగ్య శాఖ రూపొందించింది. కరోనా బాధితుల్లో 20 ఏళ్ల లోపు యువకులు 90 వేల 561 మంది, పదేళ్లలోపు 19 వేల 445 మంది ఉన్నారు. 

నివేదిక ప్రకారం..

  • మొత్తం కేసుల్లో 61.4 శాతం మంది పురుషులు కాగా.. 38.6 శాతం మంది మహిళలు ఉన్నారు.
  • 31-40 ఏళ్ల మధ్య 21.8 శాతం మంది ఉన్నారు. వారిలో 14.3 శాతం మంది పురుషులు, 7.5 శాతం మంది మహిళలు.
  • 41-50 ఏళ్ల మధ్య 17.5 శాతం ఉన్నారు. 
  • 51-60 ఏళ్ల మధ్య 14.4 శాతం మంది ఉన్నారు.
  • 61-70 ఏళ్ల మధ్య 7.7 శాతం మంది ఉన్నారు.
  • 71-80 ఏళ్ల మధ్య 2.7 శాతం మంది ఉన్నారు. 
  • 81 ఏళ్లు.. ఆపై వయసు ఉన్న వారు 0.7 శాతం మంది ఉన్నారు. 
  • కరోనా కారణంగా మరణించిన వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 55.69 శాతం మంది ఉన్నారు. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఒక్కోసారి కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షల 70 వేల 829కి చేరింది. ఒకరు మరణించారు. ఇప్పటి వరకు 3 వేల 951 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,164 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.  

 

Leave a Comment