ఒకే ఆఫీస్ లో భర్త స్వీపర్.. ఉన్నత అధికారిణిగా భార్య..!

భర్త స్వీపర్ గా పనిచేస్తున్న ఆఫీస్ లోనే బ్లాక్ డెవలప్ మెంట్ చీఫ్ గా పదవి సాధించిందో భార్య.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నల్హేరా గుజ్జర్ గ్రామానికి చెందిన సునీల్ బలియాఖేరి డెవలప్ మెంట్ బ్లాక్ లో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. యూపీలో ఇటీవల బ్లాక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. 

ఈ ఎన్నికల్లో సునీల్ భార్య సోనియా 55వ వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధించింది. తర్వాత బ్లాక్ డెవలప్ మెంట్ చీఫ్ అధికారి పోస్టుకు ఎన్నిక జరిగింది. ఆ పోస్టు షెడ్యూల్ కుల వర్గానికి కేటాయించారు. దీంతో సోనియా విద్యావంతురాలు కావడంతో ఆమెను ఆ పోస్టుకు పోటీకి నిలబెట్టారు. ఆ పోటీలో ఆమె విజయం సాధించింది. 

ఈక్రమంలో బలియాఖేరి బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసులో సోనియా అధికారిగా బాధ్యతలు చేపట్టింది. ఆ ఆఫీసులోనే తన భర్త స్వీపర్ గా పనిచేస్తున్నాడు. భార్య చీఫ్ గా ఎన్నికైనప్పటికీ స్వీపర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టనని భర్త సునీల్ కుమార్ తెలిపారు. 

Leave a Comment