వైన్ షాప్ లో దూరి మరీ మందేసిన కోతి..వీడియో వైరల్..!

సాధారణంగా మనుషులు మద్యానికి బానిస అవుతారు. కానీ కోతి మద్యానికి బానిస కావడం ఎప్పుడైనా చూశారా.. ఇదిగో ఇక్కడున్న ఈ కోతి మద్యానికి బానిసై వైన్ షాపులో దూరి మరీ మందేసింది. అది కూడా బీర్, వైన్ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్ ను తీసుకొని తాగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో జరిగింది. ప్రస్తుతం మందు కొట్టిన ఈ కోతి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అసలేం జరిగిందంటే.. బహమని బంజార్ గ్రామంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఓ కొతి రోజూ వస్తోంది. షాపు ముందు పడి ఉన్న ఖాళీ సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను టేస్ట్ చేసేది. అలా మద్యానికి అలవాటు పడ్డ ఈ కోతి ఏకంగా మద్యం దుకాణంలో చొరబడింది. 

షాపులో ప్రవేశించిన కోతి కాటన్ తెరిచి అందులో నుంచి వైన్ బాటిల్ ను తీసుకుంది. అక్కడే ఓ టేబుల్ పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్ మూతను తీసి తాగేసింది. అలా ఆ బాటిల్ మొత్తం ఖాళీ చేసింది. కోతి మద్యం తాగడాన్ని అక్కడున్న వారు వీడియో తీసి పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

Leave a Comment