వాళ్లిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు.. వీరి పెళ్లి ఖర్చు కేవలం రూ.500..!

పెళ్లి ఎంత సింపుల్ గా చేసుకున్నా వేలల్లో ఖర్చు అవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెళ్లి అయితే వేడుకలు ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ ఇద్దరు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పెళ్లికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? కేవలం రూ.500 మాత్రమే.. ఏ హంగామా లేకుండా చాలా సింపుల్ గా చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 

వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్.. వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్ గా లడఖ్ లో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ భోపాల్ కు చెందినవారు. వీరికి రెండేళ్ల క్రితం పెళ్లి నిశ్చయమైంది. అయితే అంకిత్ లడఖ్ లో పనిచేస్తుండగా, శివంగి మెజిస్ట్రేట్ గా కరోనా కట్టడికి నిరంతంరం విధులు నిర్వర్తిస్తూ బిజీ అయిపోయింది. దీంతో వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. 

 చివరకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. అయితే వీరిద్దరూ పెళ్లికి అధిక ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలికి చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇరుకుంటుబాల సమక్షంలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత సింపుల్ గా అంటే కేవలం దండలు, స్వీట్ల కోసం రూ.500 ఖర్చు చేశారు.

 

Leave a Comment