బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ గా తెలుగు బిడ్డ జరీన్..!

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తెలుగు బిడ్డ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.. ఇస్తాంబుల్ లో జరిగిన ఫైనల్ లో థాయ్ లాండ్ బాక్సర్ జిత్ పాంగ్  పై 5-0 తేడాతో చిత్తు చేసింది. ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు క్రియేట్ చేసింది. 

వరల్డ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించిన ఐదో బాక్సర్ గా తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. నిఖత్ జరీన్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించింది. వరుస బౌట్లలో ఆధిపత్యం కొనసాగించి ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజయం సాధించింది. 

భారత్ తరఫున వరల్డ్ చాంపియన్ గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్ గా నిఖత్ జరీన్ నిలిచింది. అంతకుముందు మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ ఎల్, లేఖ కేసీ మాత్రమే స్వర్ణం అందుకున్నారు. తాజాగా నిఖత్ జరీన్ కూడా వీరి సరసన నిలిచింది. మేరీకోమ్ చివరిసారిగా 2018లో గెలిచింది. నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ లో తెలుగు బిడ్డ స్వర్ణం కౌవసం చేసుకుంది.  

 

Leave a Comment