భర్త శరీరం భయంకరం..ఆ వ్యాధితో బాధపడుతున్నా ప్రేమను చాటిన భార్య..!

భార్యాభర్తల ప్రేమ అనేది ఎంతో గొప్పది. ఒకరికి ఒకరు తోడుంటూ వారు పొందే ప్రేమ అద్బుతం. ఈ నాటి రోజులల్లో చాలా జంటలు ప్రేమ పెళ్లి చేసుకుని ఏవేవో కారణాలతో విడిపోతున్నారు. ఇంకొందరు అయితే పిల్లలు పుట్టాక విడాకులు తీసుకుని పిల్లల్ని అనాధలను చేస్తున్నారు. అయితే చాలా మందిలో గమనిస్తే భార్యాభర్తలు ఏ కోపం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా నిలిచి బతుకుతున్నారు. ఓ మహిళ తన భర్తను పసిపిల్లాడిలాగా చూసుకుంటోంది. అతనికి భయంకరమైన వ్యాధి ఉన్నా కూడా ఆమె తన బిడ్డ లాగా భర్తను చూస్తోంది. కొన్ని ఏళ్ల పాటు ఆ భర్తను ప్రేమగా చూస్తోంది. మహోమ్మద్ ఉమర్ అనే వ్యక్తికి ప్రపంచ వ్యాప్తంగా బబుల్ మ్యాన్ అనే పేరుంది. ఆయనకు భయంకరమైన వ్యాధి ఉంది.

మహోమ్మద్ ఉమర్ 28 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఆయనను పరహాత్ అనే అమ్మాయి ప్రేమించింది. ఆయన్ను ఎంతగానో ఇష్టపడింది. అయితే ఆ మహిళ అతన్ని ప్రేమించే సమయంలో ఉమర్ కి ఓ భయంకరమైన చర్మ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఆ సమయంలో ఉమర్ కు ప్రారంభ దశలో ఉంది. పరిహాట్ ని ఆమె కుటుంబీకులు ఉమర్ ని మర్చిపోమని హెచ్చరించారు. తనను ప్రేమించ వద్దని పరిహాట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమర్ కు ఆ చర్మ వ్యాధి రాను రాను అతని శరీరం మొత్తం వ్యాపించేసింది. అందుకే ఉమర్ ని పెళ్ళి చేసుకుని చాలా ఇబ్బందులు పాలు అవుతావని పరిహాట్ ను ఆమె కుటుంబీకులు నచ్చజెప్పేందుకు చూశారు. అయినా కూడా పరహాట్ ఉమర్ ని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైంది.

ఎవరేం చెప్పినా ఆమె వినిపించుకోలేదు. ఉమర్ నే పెళ్లాడింది. అలా ఆమె నిజమైన ప్రేమను పరహాట్ చాటుకుంది. పెళ్లి అయ్యాక ఉమర్ కు తన చర్మ వ్యాధి ఎక్కువ అయ్యింది. ఉమర్ ఒంటి నిండా బబుల్స్ ఏర్పడ్డాయి. దానివల్ల ఉమర్ అతి భయంకరమైన వ్యక్తిగా మారిపోయాడు. ఉమర్ అలా మారినా కూడా పరహాట్ ప్రేమలో ఏ మార్పు రాలేదు. ఉమర్ తోనే జీవించింది. అలా ఆమె అతనితో ఇద్దరు పిల్లలకు ఊపిరిపోసింది. ఇద్దరుగా ఉన్నవారు ఇప్పుడు నలుగురు అయ్యారు. ప్రస్తుతం ఉమర్ కి 62 ఏళ్లు అవుతోంది. ఉమర్ ఇద్దరు కొడుకులకి తనకొచ్చిన చర్మ వ్యాధి రాకపోవడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉమర్ కు వచ్చిన వ్యాధిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉమర్ ను తన కుటుంబం సంతోషంగా చూసుకునేది. కుటుంబ సభ్యులు ఉమర్ తో చాలా అన్యోన్యంగా ఉండేవారు. ప్రస్తుతం ఉమర్, పరహాట్ ప్రేమ గురించి అందరూ చెప్పుకుంటూ ప్రశంసిస్తున్నారు. వారి ప్రేమ గొప్పదని, ఈ రోజుల్లోని భార్యభర్తలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. నిజంగా ఉమర్, పరహాట్ ప్రేమ గొప్పది. ఇలాంటి ప్రేమికులు కలకలం చరిత్రలో నిలవాలి.

Leave a Comment