శరీరంలో విటమిన్ “డి” పెరగాలంటే ఇలా చేయండి..!

చాలా మంది తమ ఆరోగ్యాన్ని బాగా చూసుకునేదానికి వ్యాయాలు చేస్తూ ఉంటారు. అయితే అదొకటే సరిపోదు. శరీరానికి సరైన పోషక పదార్థాలు ఉండి తీరాలి. మనకు అవసరమయ్యేటటువంటి మినరల్స్, విటమిన్స్ చాలా ముఖ్యం. అందుకే పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మన శరీరానికి విటమిన్ డి అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఆ విటమిన్ ను మనం శరీరంలో బాగా పెంచుకోవాలి. విటమిన్ డి అనేది ఒక ప్రో హార్మోన్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా సరే విటమిన్ డిని ఆహారం ద్వారా కానీ సూర్యకిరణాలు ద్వారా కాని తీసుకుంటే అది లివర్ లేదా కిడ్నీ ద్వారా సరఫరా అవుతుందని చెప్పొచ్చు.

అన్ని విటమిన్లలాగానే విటమిన్ డిని ఉపయోగించుకోవడానికి సాధ్యంకాదు. అది కొంత ప్రాసెస్ అయిన తర్వాతనే ఉపయోగపడుతుంది. ఒక మిల్లీ లీటరుకు 20 నానో గ్రామ్స్ నుండి 50 నానో గ్రామ్స్ ఉండాలి. 20 గ్రాముల కంటే తక్కువ ఉంటే విటమిన్-డి లోపం ఉన్నట్లు నిర్దారించవచ్చు. సూర్యకిరణాలు పడకపోవడం, పాలు ఎలర్జీ ఉండడం, కేవలం శాఖాహారం మాత్రమే తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది.

మనకు సాధారణంగా సూర్య కిరణాల వల్ల ఎక్కువగా విటమిన్ డి అనేది లభ్యం అవుతుంది. విటమిన్ డి అనేది మనకి కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. చేప, ఫిష్ లివర్ ఆయిల్ మరియు గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా ఫోర్టిఫైడ్ డైరీ మరియు గ్రైన్ ప్రొడక్ట్స్‌లో విటమిన్ డి అనేది మనకు దొరుకుతుంది. విటమిన్ డి అనేది ఎప్పుడైతే మనకు తక్కువగా ఉంటుందో అప్పుడు మనకు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జుట్టు రాలిపోవడం, ఎముకల సమస్యలు, తక్కువ ఇమ్యూనిటీ ఉండడం లాంటివి జరుగుతుంటాయి. సూర్య కిరణాలు విటమిన్-డి తీసుకోవడానికి సహాయం చేస్తాయి. చర్మంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్ ద్వారా ఇది తీసుకోడానికి వీలవుతుంది.

ఇండియాలో ప్రజల చర్మం కొంచెం డార్క్‌గా ఉండడం వలన విటమిన్ డి తీసుకోవడం కాస్త నెమ్మది అవుతుంది. భారతీయులు కొంచెం సన్నటి చర్మంతో ఉండటం వల్ల వారికి తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల వారు తక్కువ విటమిన్-డి తీసుకుంటారు. పరిశోధనల ప్రకారంగా చూస్తే 80 శాతం మంది మహమ్మారి రోగులలో విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు తేలింది. పరిశోధనలో భాగంగా 216 మంది రోగులను పరీక్షించారు. అయితే వాళ్ళల్లో 80 శాతం మంది రోగులలో విటమిన్ డి లోపం బాగా ఉన్నట్లు తెలుసుకున్నారు.

విటమిన్ డి లోపం కలిగిన వాళ్లలో హైపర్ టెన్షన్, కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా డయాబెటిస్, ఒబేసిటీ వంటి సమస్యలు కూడా విటమిన్ డి లోపం ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. విటమిన్-డి అనేది ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ఎక్కువగా విటమిన్ డి లోపం వల్ల ఎముకల సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

Leave a Comment