కరోనాతో అన్న చనిపోతే.. వదినతోనే పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచాడు..!

కరోనాతో భర్త చనిపోయాడు..దీంతో 19 నెలల కూతురు ఉన్న ఆ మహిళ ఒంటరి అయిపోయింది.. ఈక్రమంలో ఆమె భర్త తమ్ముడు సమాధాన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఆ మహిళను పెళ్లి చేసుకుని తల్లీ కూతుర్ల బాధ్యతలను స్వీకరించాడు. ఈ ఆదర్శ వివాహం మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది.. 

వివరాల మేరకు అహ్మద్ నగర్ జిల్లా అకోలేలోని ఢోక్రికి చెందిన నీలేష్ శేటే అనే వ్యక్తి  రెసిడెన్షియల్ స్కూల్ లో జాబ్ చేేసేవాడు. సెకండ్ వేవ్ సమయంలో కరోనా బారినపడ్డాడు. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో మెదడులో కణితి ఏర్పడింది. దీంతో నాసిక్ లోని ఆస్పత్రిలో చికిత్స తీసుకునేవాడు.. చికిత్స పొందుతూ 2021 ఆగస్టు 14న చనిపోయాడు. అతడికి భార్య పూనమ్, 19 నెలల కూతురు ఉన్నారు.

భర్త చనిపోవడంతో పూనమ్ ఒంటరి అయిపోయింది. కూతురు ఉండటంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న భర్త సోదరుడు సమాధాన్.. వదిన, ఆమె కూతురి బాధ్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. వదినను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించాడు. ఇప్పుడు పూనమ్ ని పెళ్లి చేసుకొని సమాజంలో ఆదర్శంగా నిలిచాడు.. 

 

Leave a Comment