అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్న యువ భారత్..!

కుర్రాళ్లు అదరగొట్టారు. అండర్-19 వరల్డ్ కప్-2022 టైటిల్ గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో శనివారం జరిగిన ఫైనల్లో టీమిండియా జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో టీమిండియా జట్లు ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకుంది. 

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్  చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరులలకు ఆలౌటైంది. పేసర్లు రాజ్ బవా (5/31) రవి కుమార్(4/34) ధాటికి ఇంగ్లండ్ జట్టు 189 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో జేమ్స్ రూ(116 బంతుల్లో 94) ఒంటరి పోరాటం చేశాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టులో ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్(50), నిశాంత్ సింధు(50), రాజ్ బవా(35) రాణించారు. 

అండర్-19 ప్రపంచకప్ గెలవడం భారత జట్టుకు ఇది ఐదోసారి.. 2000,2008,2012,2018లలోనూ టీమిండియా విజేతగా నిలిచింది. 2000లో కప్ గెలిచినప్పుడు మహ్మద్ కైఫ్ కెప్టెన్ గా ఉన్నాడు. 2008లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో, 2012లో ఉన్ముక్ చంద్, 2018లో పృథ్వీ షా, 2022లో యష్ ధుల్ నాయతకత్వంలో టీమిండియా కప్ గెలుచుకుంది.  

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Leave a Comment