ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు.. : రాహుల్

లద్దాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు మరణించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. ‘ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఆయన దాక్కుంటున్నారు? ఇక చాలు..ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి..చైనా మన సైనికులను చంపడానికి ఎంత ధైర్యం? మన భూమిని ఆక్రమించడానికి వారికి ఎంత ధైర్యం?  అని రాహులు గాంధీ ట్విట్ చేశారు. 

సోమవారం రాత్రి జరిగిన లద్దాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 భారత సైనికులు, 43 మంది చైనా సైనికులు మరణించినట్లు సమాచారం. 

‘మన దేశ సైనికులు చంపబడ్డారని తెలిసి షాక్ అయ్యాం. అమరవీరులకు వందనం చేస్తున్నాము. ప్రధాని దేశాన్ని విశ్వాసంలోకి తీసుకురావాలి’ అంటూ కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ మంగళవారం ట్విట్ చేశారు. 

 

Leave a Comment