గుడ్ న్యూస్ : కరోనాకు మందు కనిపెట్టిన యూకే..

కరోనా వైరస్ భారత్ లో ప్రమాదకరస్థితిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజుకు పది వేల కంటే ఎక్కువనే నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంతే వేగంతో కరోనా కేసులు నమోదైతే ఇండియాలో భయానక పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరణాలు కూడా భారీగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. 

ఈ తరుణంలో కరోనా వైరస్ కు యూకే వైద్యులు మందును కనుగొన్నారు. Dexamethasone అనే చౌకైన స్టెరాయిడ్ ద్వారా తీవ్ర అనారోగ్యంతో ఉన్న కోవిడ్-19 రోగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుందని నిరూపించారు. దీని క్లినికల్ ట్రయల్ కూడా మంచి ఫలితాలను ఇచ్చాయి. WHO కూడా యూకే ప్రభుత్వాన్ని అభినందించింది. ఈ మందును యూకే నుంచి ఇండియాకు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Dexamethasone మిశ్రమాన్ని 6 మిల్లీ గ్రాములు పది రోజులపాటు ఇస్తే మరణాల రేటు తగ్గే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. త్వరలోనే వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రపంచ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులు ఎదరువుతున్న సమయంలో ఈ వార్త యూకే మీడియా వర్గాలు ప్రకటించాయి. దీంతో అంతర్జాతీయ మీడియా కూడా చాలా సంతోషకరమైన వార్త అంటూ ఈ వార్తను వైరల్ చేస్తున్నాయి. కోవిడ్-19 రోగులు అధిక సంఖ్యలో ఉన్న పేద దేశాలలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటూ నెటిజన్లు యూకే వైద్యులను ప్రశంసిస్తున్నారు. 

 

Leave a Comment