ఫిట్ గా ఉన్నా.. జిమ్ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు వస్తుంది?

ఇటీవల కాలంలో చిన్న వయస్సులోనే గుండెపోటు రావడం చూస్తున్నాం.. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో 30 ఏళ్ల యువకుడు జిమ్ చేసి మెట్లపై కూర్చొని గుండెపోటుతో కూప్పకూలిపోయాడు. హిందీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా 40 ఏళ్ల వయస్సులో ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన కూడా ఎంతో ఫిట్ గా ఉంటారు. రెగ్యులర్ గా జిమ్ వర్కౌట్స్ చేసేవారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్(46) జిమ్ చేస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది.. ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. 

ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు? ఫిట్ గా ఉన్నా గుండె పోటు ఎందుకు వస్తుంది? అధికంగా జిమ్ చేస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా?.. పునీత్, సిద్ధార్థ చాలా ఫిట్ నెస్ తో ఉంటారు. వీరికి యాంజియోగ్రామ్ చేస్తే వారి రక్తనాళాల్లో ఎలాంటి రక్తపు గడ్డలు(క్లాట్స్), బ్లాక్స్ కనిపించకపోవచ్చు. అయినా అలాంటి వారికి హార్ట్ ఎటాక్ వస్తుంది.. అయితే గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడితే అది గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. దీనిని డిఫెక్షన్ అని అంటారు. 

గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ లేకపోయినా కొవ్వు కణాలతో ఏర్పడిన ఫ్లాక్ పై పగుళ్ల ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి.. అది రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. ఈ కారణంతో గుండెపోటు రావచ్చు. పునీత్ లాంటి వారి వ్యక్తుల రక్తనాళాల్లో అకస్మాత్తుగా రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి ఉండొచ్చు. ప్రోటీన్-సి, ప్రోటీన్-ఎస్, యాంటీ థ్రాంబిన్-3 డెఫిషయెన్సీ వంటి లోపాలు ఉన్న వారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉంటే కూడా ఈ క్లాట్స్ ఏర్పడతాయి. ఇలా రక్తం త్వరగా గడ్డకట్టడాన్ని బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అంటారు. ఇలాంటి వారిలో రక్తంలో క్లాట్స్ త్వరగా ఏర్పడి అది రక్త ప్రవాహానికి అడ్డంకిగా మారుతుంది. దీంతో గుండెపోటు వస్తుంది. అంతేకాక ఎంత పిట్ నెస్ గా ఉన్నప్పటికీ జీన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరిలో కొలెస్ట్రాల్ నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరడం వల్ల ప్లాక్స్ గా పిలిచే క్లాట్స్ ఏర్పడి గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. దీంతో గుండెపోటు రావచ్చు. ఇక ఒబెసిటీ, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు వల్ల కూడా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వస్తున్నాయి.

ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

  • మొదటగా జన్యుపరంగా కుటుంబంలో గుండెపోటుకు గురయ్యారా అని ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ జీన్స్ ఎఫెక్ట్ ఉంటే 40 ఏళ్లు దాటిన తర్వాత తరచూ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజేస్ కోసం టెస్టులు చేయించుకోవాలి. 
  • చాలా రిస్కీ వ్యాయామం గుండెకు అంత మంచిది కాదు. గుండె మీద ఒత్తిడి పడే వ్యాయామాలు చేయవద్దు. గుండె మీద భారం పడుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే ఆపేయాలి. వ్యాయామంలో నడక చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 
  • జంక్ ఫుడ్ జోలికి వెళ్ల కుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
  • మీ బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో నూనె తక్కువగా ఉండేటట్లు చేసుకోండి. కూరగాయల సలాడ్ లు ఉండేలా చూడండి.. దీంతో బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

 

Leave a Comment