జగన్ జైలుకెళ్తే సీఎం ఎవరు?.. షర్మిల షాకింగ్ కామెంట్స్..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు ప్రాంతాలను సమానంగా చూశారని, ఆయన ఆశయాల కోసం తెలంగాణలో పనిచేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని, ప్రతిపక్షమే లేదని అన్నారు. అందకే ఇక్కడ పార్టీ పెట్టానని తెలిపారు. 

తన అన్న వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పుడు తానెంతో కష్టపడ్డానని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి అవినీతి కేసుల్లో శిక్ష పడితే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటనీ? తర్వాత సీఎం పదవి మీకా.. లేక మీ అమ్మగారికా.. లేక జగన్ సతీమణి భారతికి దక్కుతుందా? అన్న ప్రశ్నకు షర్మిల చాలా చాకచక్యంగా సమాధానం చెప్పారు. రాజు పోతే కొడుకు, లేకపోతే చెల్లి రాజు కావడానికి ఇది రాచరికం కాదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని, ఒక వేళ ఏ కారణం చేతనైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండలేకపోతే ఆ పార్టీ విధివిధానాలను బట్టి ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారని సమాధానం చెప్పారు. తాను ఆ పార్టీలో కనీసం సభ్యురాలిని కూడా కాదని తెలిపారు. 

ఇక జగన్ మిమ్మల్ని రాజ్యసభకు పంపుతానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పినట్టు చెప్పుకుంటున్నారని, దీనికి మీరు ఏమంటారని? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. తాను ఎప్పుడూ రాజ్యసభ సీటు కోరలేదని, విన్న ప్రతి విషయం నిజం కాదని చెప్పారు. ప్రస్తుతం తాను తెలంగాణలో మంచి ఆశయంతో పార్టీ పెట్టానని, ప్రజలు తనను అర్థం చేసుకుంటారని అన్నారు.  

 

Leave a Comment