ఎవరు ఈ నూపుర్ శర్మ?.. ఆమె వివరాలేంటీ?

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ చర్చలో ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవర్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాల తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తున్నాయి.. 

మరోవైపు ఈ వివాదానికి కారణమైన నూపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేసింది. మరో వైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేశారు. అది కూడా విమర్శలకు దారి తీయడంతో ఆ ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశారు. నూపుర్, నవీన్ చేష్టల వల్ల ఇంత వివాదం చెలరేగిందని విమర్శలు రావడంతో బీజేపీ తన పార్టీ నేలతపై చర్యలు తీసుకుంది. 

నూపుర్ శర్మ ఎవరూ?

ఇంతటి వివాదానికి కారణమైన నూపుర్ శర్మ ఎవరనేది చూస్తే.. నూపుర్ శర్మ ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేశారు. ఢిల్లీ వర్సిటీ నుంచే ఆమె ఎల్ఎల్బీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆమె లా సబ్జెక్ట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.    

  • 2008లో ఢిల్లీ యూనివ‌ర్సిటీ స్టూడెంట్స్ యూనియ‌న్ ప్రెసిడెంట్ అయ్యారు.
  •  2015లో జ‌రిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ నేత అర‌వింద్ కేజ్రీవాల్‌పై ఆమె పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ యువ‌మోర్చాలో అనేక కీల‌క హోదాల్లో ప‌నిచేశారు. 
  • 2017లో ఢిల్లీ బీజేపీ అధికారి ప్ర‌తినిధిగా ఆమెను నియ‌మించారు.
  •  2020 సెప్టెంబ‌ర్‌లో జేపీ న‌డ్డా బృందంలోకి ఆమె వెళ్లారు. జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఆమెను నియ‌మించారు.
  •  టీచ్ ఫ‌ర్ ఇండియా యూత్ అంబాసిడ‌ర్‌గా ఆమె కొన‌సాగుతున్నారు.

 

Leave a Comment