ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేస్తే.. పార్శిల్ లో రిన్ సబ్బు వచ్చింది..!

ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం.. ఏదీ కొనాలన్నా షాపులకు వెళ్లాల్సిన పనిలేదు. ఒక్క క్లిక్ చేస్తే చాలు కోరుకున్న వస్తువు ఇంటి వద్దకే వచ్చేస్తుంది. అయితే ఆన్ లైన్ షాపింగ్ మోసాలు కూడా జరుగుతుంటాయి. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బులు రావడం, ఇతర వస్తువులు రావడం అప్పుడు చూస్తుంటాం.. ఇది వరకు ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగాయి. 

తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఉట్నూరులోని బోయవాడకు చెందిన పందిరి భీమన్న ఐదు రోజుల క్రితం ఈ కామర్స్ సైట్ లో సెల్ ఫోన్ ఆర్డర్ చేశారు. పార్శిల్ వచ్చిన తర్వాత తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఆ పార్శిల్ లో ఫోన్ కి బదులు రిన్ సబ్బు వచ్చింది. ఇటీవల ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా వీడియో తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో భీమన్న పోలీసులను ఆశ్రయించాడు.  

Leave a Comment