పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మిమ్మల్ని కాదంటే ఏం చేస్తారు? కొందరు చెబు వ్యసనాలకు బానిసలవుతారు. మరి కొందరు పోతే పోని అని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ ఇతడు మాత్రం డిఫరెంట్ గా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి కాదనడంతో తనను తానే పెళ్లి చేసుకున్నాడు.
బ్రెజిల్ లోని బాహియాకు చెందిన డియగో రబేలో గతేడాది నవంబర్ లో విటర్ బ్యూనోతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో ఘనంగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ అంతలోపే వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో జులైలో విటార్ పెళ్లికి నిరాకరించింది.
అయితే డియగోకు మాత్రం పెళ్లి ఆలోచన పోలేదు. ఎలాగైన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించారు. అక్టోబర్ 17న ఇటాకేర్ లోని రిసార్ట్ లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి చేసుకుంది అమ్మాయితో కాదు. కుడి చేతికి రింగు తొడుక్కొని తనను తానే వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అతిథులకు మంచి విందు కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఎవరో తమను కాదన్నారని కుంగిపోవాల్సిన అవసరం లేదని డియగో తెలపాడు. తనకు తాను ఎంతో ఇష్టపడతానని, అందుకే పెళ్లి చేసుకున్నానని అన్నాడు. అయితే భవిష్యత్తులో మరెవ్వరినైనా పెళ్లి చేసుకుంటానని డియగో చెప్పాడు.