పొట్ట చీల్చుకుని బయటకు వచ్చిన స్నేక్ ఈల్..!

సముద్ర తీరాల్లోని బురద, ఇసుక ప్రాంతాల్లో నివసింసే స్నేక్ ఈల్ ను ఓ హెరాన్(నారాయణ పక్షి) మింగేసింది. అయితే ఆ స్నేక్ ఈల్ మాత్రం తనను మింగేసిన హెరాన్ పొట్ట చీల్చుకుని మరీ బయటకు వచ్చేసింది. దీనిని సామ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. అమెరికాకు చెందిన సామ్ డేవిస్ అనే ఫొటో గ్రాఫర్ కొద్ది రొజుల క్రితం మేరీల్యాండ్ లోని అటవీ ప్రాంతంలో జంతువుల ఫొటోలు తీస్తున్నాడు. ఆ సమయంలో గాల్లో ఎగురుతున్న హెరాన్ కనిపించింది. అయితే దాని పొట్ట భాగంలో ఓ స్నేక్ ఈల్ వేలాడుతూ ఉంది. 

మొదటగా అది హెరాన్ పొట్టను అతుక్కుందని భావించినా, తర్వాత షాక్ అయ్యాడు. ఆ స్నేక్ ఈల్ దాని పొట్టను చీల్చుకుని బయటకు రావడం గమనించాడు. సముద్ర తీరాల్లోని బురద, ఇసక ప్రాంతాల్లో నివసిస్తుంటాయని సామ్ అన్నాడు. ఏదైన జీవి వీటిని సజీవంగా తిన్నప్పుడు వాటికున్న పదునైన తోకను ఉపయోగించి బయటకు వస్తాయని తెలిపాడు. అయితే పొట్ట చీల్చినా హెరాన్ మాత్రం బతికి ఉందన్నాడు. 

Leave a Comment