నదిలో పొంగి పోర్లిన పాలు.. చూశారా..!

యూకేలోని వేల్స్ నగరంలో దులైస్ అనే నది ఒకటి.. ఆ నదిలో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఏప్రిల్ 14న దులైస్ నదిలో పాలు పాలు పొంగిపోర్లాయి. కొన్ని గంటల పాటు అలా పాలు నదిలో పారుతూనే ఉన్నాయి. నదిలో పాల ప్రవాహాన్ని చేసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఏం జరిగిందంటే.. నదికి కాస్త దూరంలో ప్రమాదం జరిగింది. ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లో ఉన్న పాలన్నీ నదిలోకి ప్రవహించాయి. దీంతో పాలన్నీ నీళ్ల పాలయ్యాయి. నదిలో పాల ప్రవాహాన్ని చేసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. అంతా ఏదో మాయలా ఉందే అని స్థానికులు భయాందోళనకు గుర్యారు. అసలు విషయం తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు.   

Leave a Comment