ఫేషియల్ కు వెళ్లిన హీరోయిన్ ని.. చివరికి ఇలా మార్చేసిన డాక్టర్..!

హీరోయిన్లు అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.. తమ అందాలను పెంచుకునేందుకు ఫేషియల్స్ చేసుకుంటారు. మరి కొందరు సర్జరీలు కూడా చేసుకుని తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో ముఖం మీద చిన్న గీత పడినా తట్టుకోలేరు. తాజాగా ఫేషియల్ కోసం వెళ్లిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది.. తన ముఖాన్ని మరింత అందంగా చేస్తామని చెప్పిన డాక్టర్ ఆమెను మరింత అందవికారంగా మార్చింది..

తమిళ నటి రైజా వల్ సన్ సాధారణ ఫేషియల్ కోసం ఓ క్లినిక్ కు వెళ్లింది. అక్కడ ఉన్న లేడీ డాక్టర్ ఆమె ముఖాన్ని మరింత అందంగా మారుస్తానంటూ బలవంతంగా ఆమెకు చర్మ చికిత్స చేసింది. దీంతో అది వికటించింది. దీంతో ఆ నటి కంటి కింద వాచిపోయి, ఉబ్బిపోయిదవ తన అందాన్నే దెబ్బ తీస్తోంది. ఈ విషయాన్ని నటి రైజా స్వయంగా వెల్లడించింది. 

తనకు అవసరం లేకపోయిన డాక్టర్ భైరవి తనకేదో ట్రై చేసిందని, చివరికి ఫలితం ఇదిగో ఇలా వచ్చిందని తెలిపింది. దీని గురించి నిలదీద్దాం అంటే ఆమె తనతో మాట్లాడటానికి, కలవడానికి కూడా నిరాకరిస్తోందని చెప్పింది. సిబ్బందిని అడిగితే ఆమె అసలు నగరంలోనే లేదని జవాబిస్తున్నారని పేర్కొంది. దీనికి సంబంధించి తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఫోటోను జత చేసింది.   

  

Leave a Comment