పట్టాలపై చిన్నారి.. లైఫ్ రిస్క్ చేసి కాపాడిన రైల్వే మాన్.. మీరు చూడండి..!

రైలు వేగంగా ముందుకు వస్తుంటే లైఫ్ రిస్క్ చేసి ఒకరిని కాపాడటం మనం సినిమాల్లోనే చూసింటాం.. అయితే పట్టాలపై పడ్డ చిన్నారిని రక్షించేందుకు ఓ రైల్వే ఉద్యోగి తన లైఫ్ ను రిస్క్ లో పెట్టి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు. దీంతో ఆ రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ పాం వద్ద నడుచుకుంటూ వెళ్తూ బ్యాలెన్స్ తప్పి ఓ చిన్నారి రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేశాడు. ఇది గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వెంటనే స్పందించాడు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నాడు. ఇదంతా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. 

ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియోన దక్షిణ మధ్య రైల్వే షేర్ చేయడంతో అది వైరల్ అయింది. రైల్వే ఉద్యోగి సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఇక నెటిజన్లు కూడా రైల్వే ఉద్యోగి సాహసంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.  

 

Leave a Comment