‘ఏం కలియుగం’..ఖుష్బూ వివాదాస్పద ట్వీట్..

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ వైభవంగా పూర్తయింది. ఈ భూమి పూజలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 40 కిలోల వెండి ఇటుక ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. దీంతో వందల ఏళ్ల నిరీక్షణ ముగిసిందని ఈ సందర్భంగా ప్రధాని మోడి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా దేశమంతా రామమయం అయింది. జైశ్రీరామ్ నినాదాలు హోరెత్తించాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోలో మోడీ బాల శ్రీరాముడి చేయి పట్టుకుని రామ మందిరం వైపు నడిపిస్తున్నాడు. ఆ ఫొటోపై సీనియర్ నటీ, తమిళనాడు కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు..‘ఇప్పుడు రాముడి కంటే మోడీ పెద్దవాడయ్యారన్నమాట..ఏం కలియుగం’ అంటూ చెప్పారు. 

ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తే..మరి కొంత మంది సమర్తించారు.  శ్రీరాముడు సమస్త లోకానికి దారి చూపేవాడు..అలాంటి రాముడికి మోడీ దారి చూపడమేంటని కొంత మంది ఈ పోస్టుపై కామెంట్లు పెడుతున్నారు.  

ఇదిలా ఉండగా ఖష్బూను రేప్ చేసి చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఆ కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిందని తెలుసుకున్న ఖష్బూ..ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ తో సహా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ట్యాగ్ చేశారు. తన లాంటి వ్యక్తులకే బెదిరింపులు వస్తున్నాయంటే..సామాన్య మహిళల పరిస్థితి ఏంటని పేర్కొన్నారు.

Leave a Comment