ఆదర్శం : సిగరెట్లు మానేసి ఇల్లు కట్టాడు..!

ధూమపానం ఆరోగ్యానికి హానికరం..సిగరెట్ తాగడం ప్రమాదకరం..మానేయండి..అంటూ ఎన్నో ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. సిగరెట్ బాగా అలవాటు అయిన వారికి ఇది చాలా కష్టమైన పని. దీన్ని మానేయాలని ఉంటుంది..కానీ అది కుదరదు..పొగతాగడం, పీల్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికి తోడు సిగరెట్ తాగడం వల్ల బోలెడు డబ్బులు వృధా అవుతాయి. అయినా చాలా మంది మానేయలేకపోతుంటారు. 

కానీ కేరళకు చెందిన ఓ వ్యక్తి సిగరెట్లు తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతను సిగరెట్ మానేయాలని ధృడ సంకల్పం చేసుకున్నాడు. సిగరెట్ డబ్బులను ఆదా చేయాలనుకున్నాడు. ఆ వ్యక్తి ప్రతి రోజూ ఒకటిన్నర ప్యాకెట్ల సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును 8 సంవత్సరాలుగా పూర్తిగా మానేశాడు. ఇక సిగరెట్ల కోసం ఖర్చు చేసే డబ్బులను ఆదా చేశాడు. అవి 8 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు అయ్యాయి. ఆ మొత్తంతో తన ఇంటిపై మరో అంతస్తు నిర్మించుకున్నాడు. సిగరెట్లు మానేయాలనుకునే వారికి ఆదర్శంగా నిలిచాడు. ఎనిమిది సంవత్సరాలకే ఐదు లక్షలు అయ్యాయంటే ఇక జీవితాంతం కాలిస్తే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి..

Leave a Comment