పసిడి సరికొత్త రికార్డు..!

బంగారం అంటే ఇష్టపడని వారుండరు. అయితే పుత్తడి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారుతోంది. వివాహాల నేపథ్యంలో కొందరు తప్పనిసరిగా నగలను విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో వాణిజ్య రంగం దెబ్బతిని, మరొకొందరు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. 

బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డుకు చేరాయి. బంగారం సరికొత్త జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,820కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,020కి పెరిగింది. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే రూ.6,450 ఎగబాకి రూ.71,500కు చేరుకుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలే ఇందుకు కారణం..

భారత్ లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు 

 

నగరంఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూపాయలలోఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూపాయలలో
హైదరాబాద్53,02057,830
విజయవాడ53,02057,830
చెన్నై53,02057,830
బెంగళూరు51,81056,510
న్యూఢిల్లీ53,51054,710
ముంబాయి53,41054,410

 

Leave a Comment