అసలు కరోనా వైరస్ గురించి మనలో చాలా మందికి తెలీదు. అసలు కరోనా వైరస్ అంటే ఏంటీ? అది ఎలా వ్యాపిస్తోంది. దానిని ఎలా నివారించాలి. అనే దానిపై చాలా మందికి అవగాహన లేదు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా..కరోనా గురించి వైద్యులు సూచిస్తున్నా మనం పట్టించుకోవడం లేదు. చాలా మంది కరోనాపై అవగాహన లేనివారి కోసం ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాం.
కరోనా అనేది ప్రాణం లేని ఒక ప్రోటీన్ పదార్థపు కణము. దీని పైన కొవ్వు పదార్థము ఒక పొరలా ఏర్పడి ఒక పౌడరు లాగా ఉంటుంది. ఇతర వాటిలా కాక ఈ కణం కొంత బరువు కలిగి ఉండటంతో గాలిలో ఎగురలేదు. భూమిపై పడిపోతుంది.
ఎలా వృద్ధి చెందుతుంది?
ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా 14 రోజులు ఉండి, వీర్య కణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో, ఈ కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే ఉండి, ఈ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరంలోని “చీమిడి”తో సంపర్కం చెందుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది.
మన ముక్కులోని చీమిడిలో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి ‘కలక’ లేక ‘పుసిలి’ కానీ, ముక్కులోని ‘చీమిడి’ కానీ, నోటిలోని ‘గళ్ళ’ కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని ఉధృతం చేసుకుంటుంది.
దీని వ్యాప్తి ఎలా?
రోగి తుమ్మినపుడూ, దగ్గినపుడూ, వారి తుంపరుల ద్వారా ఈ కణాలు ఎక్కడ అంటే అక్కడ పడతాయి. రోగికి మనం దగ్గరగా ఉంటే అవి మనపై పడొచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, ఆయా పదార్థ లక్షణాలనుు బట్టి వాతావరణంలోని వేడిని స్వీకరించే సామర్థ్యాన్ని బట్టి అవి 4 నుంచి 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై ఉన్న కొవ్వు పొర కరగి పోయి నిర్వీర్యమవుతుంది.
ఇప్పటి వరకూ ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటంతో, దీనిపై గల కొవ్వు పొర కరగడానికి ఎక్కువ ఆస్కారం లేక పోవడం ఒక కారణం.
ఈ మధ్య సమయంలో వాటిని మనం స్పర్శించినా అవి మనకు అంటుకుంటాయి. సర్వ సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శిస్తాము. కాబట్టి మన అరచేతులకు, వేళ్లకు అంటుకునే అవకాశం ఉంది. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్లను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం. ఇలా ఈ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అక్కడికి సులభంగా చేరిపోతాయి.
ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చిమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరితే, ఇక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో ఉంటాయి. కళ్ళ కలకను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృద్ధి చెంది, ముక్కు పక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది. దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు.
దీని నివారణ ఎలా?
దీనికి రక్షక కవచం దీనిపైనున్న కొవ్వు పదార్ధం. ఈ కొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.
సాధారణంగా కొవ్వు పదార్థం వేడికి కరగి పోతుంది. లేక ‘సబ్బు’ నురుగకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే.
మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో, రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడంతో మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల కొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. దాని తరువాత కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగ కణాలు మళ్లీ పడినా, అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మళ్లీ స్నానం చేయడం ద్వారా వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో ఒక నిముషం పాటు శుభ్ర పరచుకోవాలి. అలాగే మనం ధరించే వస్త్రాలు, మాస్కులు, కర్చీఫ్ లను శుభ్రపరుచుకుంటే ఈ వ్యాధి కణాలపై ఉన్న కొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కణం మన ముఖానికి చేరకూడదు. కంటి కలకతో కాని, ముక్కు చీమిడి లేక పొక్కులతో, నొటి గళ్లతో కాని తాకితే దానిని అడ్డుకోవడవ కష్టం.