కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 6,01,502 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 27,438 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1.33లక్షల మంది రోగులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా వైరస్ తో చనిపోయిన వారు 1700పైగా ఉన్నారు. 1.40లక్షల మందికిపైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. చైనాలో మూడు వేల మందికి పై చనిపోయారు. ఇటిలీలో అయితే మరీ దారుణం..9 వేలకు పైగా ప్రజలు మరణించగా 74వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. స్పెయిన్ లో ఐదు వేల మందిని బలితీసుకుంది. జర్మనీలో దాదాపు 400 మంది చనిపోయారు. ఇక భారత దేశంలో 775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. తెలంగాణలో 45 మందికిపైగా పాజిటివ్ కేసులు వచ్చాయి.