చేతి గోర్లపై ఈ గుర్తులు దేనికి సంకేతం..?

మన చేతి గోర్లపై అప్పుడప్పుడు కొన్ని గుర్తులు ఏర్పడుతుంటాయి.. అర్ధ చంద్రాకారంలో, తెలుపు రంగు, నీలి రంగు, పసుపు రంగులో ఈ గుర్తులు ఉండటం గమనించే ఉంటారు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందని మాత్రం తెలుసుకుని ఉండరు. ఇలాంటి గుర్తులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్ల ఆకారాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. మీ చేతి గోర్లు ఏం చెబుతున్నాయి? మీ చేతి వేళ్ల గోర్ల రంగు, తీరును బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది.. అనే ఇప్పుడు తెలుసుకుందాం.. 

గోర్లపై నల్ల మచ్చలు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లపై నల్లటి మచ్చలు అనేవి భవిష్యత్తులో మీ వైఫల్యాలను లేదా ఏదైనా నష్టాన్ని సూచిస్తాయి. అంతేకాదు ఆరోగ్యపరంగాను ఇది మంచిది కాదు. గోర్ల పై నల్లటి మచ్చలు ఉండటం రక్త సంబంధిత వ్యాధికి సూచిక అని చెప్పొచ్చు. గోళ్లు నల్లగా ఉంటే వారు తరచుగా ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంటారు. వీరికి చిరాకు ఎక్కువగా ఉంటుంది. 

తెలుపు రంగులో గోర్లు:

వేళ్ల గోర్లు తెల్లటి రంగులో ఉంటే.. ఆ వ్యక్తులు కష్టపడే తత్వం కలిగి ఉంటారు. వీరు ఎంతో చాకచక్యంగా అనున్న దాన్ని సాధిస్తారు. వీరు ఏపనిలోనూ ఆలస్యం చేయడానికి ఇష్టపడరు. ప్రతిదీ త్వరగా చేయాలని అనుకుంటారు. 

గులాబీ రంగులో గోళ్లు:

చేతి గోళ్లు గులాబీ రంగులో వారు ఆరోగ్యంగా, సంతోషంగా, ఉదారంగా ఉంటారు. ప్రగతిశీల ఆలోచనలు కలిగి ఉంటారు. 

చిన్న గోళ్లు:

చేతి గోళ్లు చిన్నగా ఉన్న వారు కాస్త మొరటుగా వ్యవహరిస్తారు. అలాంటి వారు సంకుచిత మనస్తత్వం కలిగి ఉంటారు. 

చుతురస్త్రాకార గోళ్లు:

గోళ్లు చతురస్త్రాకారంగా ఉన్న వారు చిన్న విషయానికి కూడా తరచుగా భయపడతారు. అలాంటి వారు తరచుగా గుండె జబ్బులకు గురవుతుంటారు. 

 

 

Leave a Comment