పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేస్తే.. లోపల చూసి శాస్త్రవేత్తలకు మైండ్ బ్లాక్..!

ప్రపంచంలో ముఖ్యమైన మతాల్లో బైద్ధం ఒకటి.. ఈ మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆచరిస్తారు. ఈ మతానికి సంబంధించి చారిత్రక ఆధారాలు అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో ఓ పురాతన బుద్ధ విగ్రహం బయటపడింది. దీని మూలాలు ఏంటని తెలుసుకునేందుకు కొందరు శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని స్కాన్ చేశారు. ఆ విగ్రహంలో కనిపించిన దాన్ని చూసి వారు షాక్ అయ్యారు. ఇంతకు అందులో ఏముందంటే..?

నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని స్కాన్ చేసి చూడగా అందులో ఒక మనిషి అస్థిపంజరం ఉంది. ఇది చూసిన అధికారులు షాక్ అయ్యారు. దాదాపు వెయ్యి ఏళ్ల నాటి అస్థిపంజరం ఆ విగ్రహంలో కనిపించింది. అది 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఆ అస్థిపంజరానికి వస్త్రం కప్పి ఉంది. అంతేకాదు చైనీస్ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయి. దీనిని లోతుగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఆ అస్థిపంజరం చైనాకు చెందిన లిక్వాన్ అనే బౌద్ధ సన్యాసిదిగా తేల్చారు. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని పరిశీలనలో ఉంచి దానిపై పరిశోధనలు చేస్తున్నారు.  

 

Leave a Comment