Big Boss – 5 : హౌస్ లో వెళ్లిన కంటెస్టెంట్లు వీరే..!

తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో షో మొదలైంది. మిస్టర్ మజ్ను పాటకు తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. తర్వాత హౌస్ మొత్తం తిరిగి ఆడియన్స్ కు బిగ్ బాస్ హౌస్ ను పరిచయం చేశాడు. తర్వత ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లను పరిచయం చేశారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌల్ లోపలకి వెళ్లారు. సిరి హన్మంత్ తొలి కంటెస్టెంట్ కాగా, యాంకర్ రవి చివరిగా వెళ్లాడు. 

సిరి హన్మంత్:

బిగ్ బాస్ సీజన్ 5లో తొలి కంటెస్టెంట్ గా యూట్యూబర్, సీరియల్ నటి సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చింది. మాస్ పాటకు స్టెప్పులేస్తూ బిగ్ బాస్ స్టేజిపైకి వచ్చింది. ప్రేక్షకులకు తన నుంచి ఏం కోరుకుంటారో దాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్ననంటూ సిరి హౌస్ లోకి అడుగు పెట్టింది..

విజయ్ సన్నీ:

ఇక రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు విజయ్ సన్నీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నాగార్జున విజయ్ తో తన డ్రీమ్ గర్ల్ బొమ్మ గీయించారు. తర్వాత విజయ్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.  

లహరి షారి:

మూడో కంటెస్టెంట్ గా నటి లహరి షారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వస్తేనే నాగార్జునకు అరుదైన గులాబీని ఇచ్చింది. నాగ్ కూడా లహరికి ఓ గులాబీ ఇచ్చి హౌస్ లోకి పంపించారు. 

సింగర్ శ్రీరామచంద్ర:

నాలుగో కంటెస్టెంట్ గా ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడానికే బిగ్ బాస్ లోకి వచ్చానని శ్రీరామచంద్ర చెప్పాడు.  

యానీ మాస్టర్:

ఐదో కంటెస్టెంట్ గా డ్యాన్స్ మాస్టర్ యానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ లో అబ్బాయిలే విన్నర్స్ గా నిలిచారని, ఈసారి తప్పకుండా అమ్మాయి గెలుస్తుందని యానీ మాస్టర్ ధీమా వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే తన కుమారుడిని బాగా మిస్సవుతానని భావోద్వేగంతోనే హౌస్ లోకి అడుగుపెట్టారు. 

లోబో:

ఆరో కంటెస్టెంట్ గా మహమ్మద్ ఖయ్యూం అలియాస్ లోబో ఎంట్రీ ఇచ్చాడు. ఓ కజికిస్తాన్ అమ్మాయికి టాటూ వేస్తే.. ఆ అమ్మాయి తనకు లోబో పేరు పెట్టిందని చెప్పాడు. ఇక తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చెబుతూ ఎమోషనల్ కు గురయ్యాడు. 

నటి ప్రియ:

ఏడో కంటెస్టెంట్ గా సినీ నటి ప్రియ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇన తన గురించి తాను తెలుసుకోవడానికి బిగ్ బాస్ కు వచ్చినట్లు ప్రియ చెప్పారు. 

మోడల్ జెస్సీ:

ఎనిమిదో కంటెస్టెంట్ గా మోడల్ జెస్సీ ఎంట్రీ ఇచ్చాడు. 36 గంటల పాటు ఏకధాటిగా మోడలింగ్ చేసి రికార్డు నెలకొల్పాడని నాగార్జున జెస్సీ గురించి చెప్పారు.  హౌస్ లో అందరికీ మోడలింగ్ నేర్పి, వాక్ చేయిస్తావేమో అంటూ హౌస్ లోకి పంపించారు. 

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ :

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తొమ్మిదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో అమ్మాాయికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ట్రాన్స్ జెండర్ గా మారనని ప్రియాంక చెప్పింది. ఈ విషయం తన తండ్రికి తెలియదని, ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం తన తల్లికి తెలుసని చెప్పింది. 

షణ్ముఖ్:

ఇక పదో కంటెస్టెంట్ గా షణ్ముఖ్ జస్వంత్ అదిరిపోయే డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చాాడు. వెబ్ సిరీస్ లతో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ షో కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కాలేదని, సిరికొత్తగా కెరీర్ ను మొదలు పెట్టాలనుకుంటున్నానని షణ్ముఖ్ తెలిపాడు. 

నటి హమీదా:

సాయం సేయరా డింభకా సినిమా హీరోయిన్ హమీదా 11వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అబ్బాయిల్లో హైట్, కళ్లు, చిరునవ్వు, హెయిర్ స్టయిల్ అంటే ఇష్టమని చెప్పింది.

కొరియోగ్రాఫర్ నటరాజ్:

12వ కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి డ్యాన్స్ మాస్టర్ అయ్యానని నటరాజ్ చెప్పారు. తన భార్య ఏడు నెలల గర్భిణీ అని, ఆమె చెప్పిన ధైర్యంతోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నానని తెలిపారు. అమ్మైనా, నాన్న అయినా తనే అన్నారు. 

సెవెన్ ఆర్ట్స్ సరయు:

సెవెన్ ఆర్ట్స్ సరయు 13వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. యూట్యూబ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయే డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ సరయు నాగ్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టయిల్ లో సమాధానాలు చెప్పి నవ్వులు పూయించింది. చిన్నప్పటి నుంచి అన్నపూర్ణ స్టుడియోస్ లో అడుగుపెట్టాలనేది తన కోరిక అని, అది బిగ్ బాస్ తో తీరిందని చెప్పంది.  

నటుడు విశ్వ:

సీరియల్ నటుడు విశ్వ బిగ్ బాస్ హౌస్ లోకి 14వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున నిర్మించిన ‘యువ’ సీరియల్ తోనే నటుడిగా పరిచయం అయినట్లు తెలిపాడు. నాగచైతన్య ఫస్ట్ మూవీలోనూ నటించానని, అఖిల్ తాను కలిసి చదువుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ ట్రయల్ అవుట్ జరిగితే అందులో ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలిపాడు. 

నటి ఉమాదేవి:

కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి బిగ్ బాస్ 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని ఉమ అన్నారు. తాను మనసులో ఏమనుకుంటానో అదే మాట్లాడుతానని చెప్పారు. అది బిగ్ బాస్ లో చూపిస్తానని అన్నారు. 

నటుడు మానస్:

నటుడు మానస్ బిగ్ బాస్ హౌస్ లోకి 16వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తనకు ఛాలెంజ్ అంటే ఇష్టమని, అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని మానస్ తెలిపాడు. హౌస్ లో హీరోలా ఉండటానికే ప్రయత్నిస్తానని చెప్పాడు. కాగా, సోడా గోలి సోడా, ప్రేమికుడు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు మానస్.. 

ఆర్జే కాజల్:

17వ కంటెస్టెంట్ గా ఆర్జే కాజల్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన కాజల్ బుల్లి తెరపై తొలిసారి యాంకర్ గా టాలీవుడ్ చానెల్ లైవ్ ప్రోగ్రామ్ హ్యాపీ మార్నింగ్ తో ప్రేక్షకులకు పరిచయం అయింది. బిగ్ బాస్ నుంచి వెళ్లేలోపు నాగార్జునతో ఐలవ్ యూ చెప్పించుకుంటానని చెప్పింది. వెంటనే నాగ్ ఐలవ్ యూ అని చెప్పి కాజల్ ను ఎంకరేజ్ చేశారు. 

శ్వేత వర్మ:

ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ తదితర చిత్రాల్లో నటించిన శ్వేత వర్మ 18వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన టాలెంట్ తో సీజన్-5ను చించి పడేస్తానని, తనలో ఉన్న ఐదు రూపాలను హౌస్ లో చూపిస్తానని చెప్పుకొచ్చింది.  

యాంకర్ రవి:

19వ కంటెస్టెంట్ గా యాంకర్ రవి బిబ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనను ఇప్పటి వరకు యాంకర్ రవిగానే చూశారని, ఇక నుంచి రియల్ రవి కిరణ్ ను చూడబోతున్నారని రవి అన్నారు. ఈ సందర్భంగా రవి ముద్దుల కూతురితో అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పించారు నాగార్జున.  

 

 

  

      

Leave a Comment