కోరిక తీరిస్తేనే ఉద్యోగమంటే లొంగిపోయా.. కోరిక తీర్చుకుని మోసం చేశారు.. ఏలూరు యువతి ఆవేదన..!

ఉద్యోగం పేరుతో తనను లొంగదీసుకుని మోసం చేశారని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. కోరిక తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని, వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధిపులకు గురిచేస్తున్నారని ఆరోపించింది. 

వీడియోలో యువతి ఏం చెప్పిదంటే.. ‘ఇద్దరు మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని కేఆర్ పురం ఐటీడీఏ ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లారు. ఆయన తణుకులో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని, నన్న కమిట్ మెంట్ అగిడాడు. ఉద్యోగం కోసం ఆశతో.. గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయాను. పలుమార్లు నన్ను ఆయనతో తీసుకెళ్లారు. ఆ తర్వాత ఉద్యోగం కోసం అడిగినా పట్టించుకోవడం లేదు. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ నాతో రమ్మంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఉద్యోగం రాకపోగా, లొంగిపోయి మోసపోయాను. నాలా మరో అమ్మాయికి జరగకూడదనే ఉద్దేశంతోనే బయటపెడుతున్నాను. ఈ వీడియో సీఎం జగన్ వరకూ వెళ్లాలి. నాకు న్యాయం చేయాలి.’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. 

సాయంత్రానికే మాట మార్చంది:

ఐటీడీఏ ఉన్నతాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి సాయంత్రానే మాట మార్చింది. ఐటీడీఏ పీవో శారీరకంగా తనను ఏమీ చేయలేదని తెలిపింది. ఆయనను ఉద్యోగం కోసం కలిసింది వాస్తవమేనని, తనను భయపెట్టి ఇద్దరు వ్యక్తులు అలా చెప్పించారని మరో వీడియో విడుదల చేసింది. 

Leave a Comment