అంపైర్ ఔట్ ఇవ్వలేదని వికెట్లు పీకి పారేసిన షకిబుల్..!

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించాడు. అంపైర్ ఔటివ్వలేదని నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని వికెట్లను కాలితో తన్నాడు. అంతేకాదు అంపైర్ ను దుర్భాషలాడాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్ లో ఈ సంఘటన జరిగింది. 

లీగ్ లో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్(MSC) అబహీనీ లిమిటెడ్ (AL) మధ్య మ్యాచ్ జరిగింది. షకిబుల్ హసన్ MSCకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అబహానీ లిమిటెడ్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీంకు షకీబ్ బౌలింగ్ చేశాడు. ఎల్బీ కోసం ఎంపైర్ కు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. 

అంతే  షకిబుల్ సహనం కోల్పోయాడు. ఆగ్రహంతో అంపైర్ పైకి దూసుకెళ్తూ నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని వికెట్లను కాళ్లతో తన్నాడు. మరికొద్ది సేపటికి పవర్ ప్లే ఓవర్ల సందర్భంగా మరోసారి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అంపైర్ ను దూర్భాషలాడుతూ నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న మూడు వికెట్లను పీకి పారేశాడు. షకీబ్ ప్రవర్తన పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. 

Leave a Comment