భార్యకు సర్కారి కొలువు వచ్చిందని చేయి నరికేసిన భర్త..!

ఎవరికైనా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎంతో సంతోష పడతారు.. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు ఉద్యోగం వచ్చిందని దారుణానికి ఒడిగట్టాడు. భార్య చేయి నరికేశాడు.. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లోని చోటుచేసుకుంది.. 

తూర్పు బర్ధమాన్ జిల్లా కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహ్మద్, రేణు ఖాతున్ భార్యభర్తలు.. రేణు దుర్గాపూర్ లోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో నర్సింగ్ ట్రైనింగ్ తీసుకుంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. 

అయితే రేణు ఉద్యోగం చేయం భర్త షేర్ మహ్మద్ కి ఇష్టం లేదు. ఉద్యోగం వస్తే తనను విడిచిపెట్టి వెళ్లి పోతుందని భయపడిన భర్త.. ఉద్యోగం మానేయాలని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 

ఈక్రమంలో కోపంతో షేర్ మహ్మద్ దారుణానికి ఒడిగట్టాడు. పదునైన ఆయుధంతో భార్య కుడి చేయిని నరికేశాడు. రక్తపు మడుగులో ఉన్న రేణును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి ఆమె చేయిని తొలగించారు. నిందితుడితో సహా అతడి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. 

Leave a Comment