వింత అలవాటు.. 40 ఏళ్లుగా ఇసుక తింటున్నాడు..!

కొందరి ఆహారపు అలవాట్లు చూస్తే ఔరా అనాల్సిందే.. ఎందుకంటే అంత విచిత్రంగా ఉంటాయి.. సాధారణంగా తినే ఆహారంలో పొరపాటున ఇసుక రేణువులు తగిలితే.. కోపంతో ఆ ఆహారాన్నే తినడానికి ఇష్టపడరు.. అలాంటిది ఓ వ్యక్తి 40 ఏళ్లుగా ఇసుకనే ఆహారంగా తింటున్నాడు.. ప్రతి రోజూ గుప్పెడు ఇసుకను ఆహారంగా తీసుకుంటున్నాడు..  

ఉత్తరప్రదేశ్‌లోని అరంగాపూర్‌కు చెందిన హరిలాల్‌ సక్సేనా అనే వలస కూలీ పదేళ్ల క్రితం ఉపాధి కోసం ఒడిశాకు వచ్చాడు. గంజాం జిల్లాలోని కిర్తిపుర్‌ గ్రామంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి గత 40 ఏళ్లగా రోజూ పిడికెడు ఇసుక తింటున్నాడు. భోజనం చేసిన తర్వాత లేదా భోజనానికి ముందు ఇసుక తినడం అతనికి అలవాటు.

తన చిన్నప్పుడు తమ గ్రామానికి దగ్గర్లోనే ఉన్న నది వద్దకు వెళ్లి రోజూ ఇసుక తినేవాడినని హరిలాల్ చెప్పాడు. వర్షాకాలం కోసం ముందుగానే ఇసుకను ఇంట్లో భారీగా నిల్వ ఉంచుకునేవాడినని అన్నాడు. గతంలో విపరీతంగా ఇసుకను తినేవాడినని.. ఇప్పడు కాస్త తగ్గించానని తెలిపాడు. ఇసుక తిన్న తర్వాత కొంచెం పొట్టలో కొంత అసౌకర్యంగా ఉంటుందని, అంతకుమించి ఇప్పటివరకు ఎలాంటి సమస్యా ఎదురవ్వలేదని అన్నాడు. 

Leave a Comment