వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్.. పెరగనున్న ఈఎంఐల భారం..!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. తాజాగా మరో 50 బేసిన్‌ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి పెరిగింది. కాగా మేలో 40 బేసిన్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రారంభమైన ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి)లోని ఆరుగురు సభ్యులు తాజా రేట్ల పెంపునకు అనుకూలంగా ఓటు వేశారు.

మూడు రోజుల పాటు సమావేశమై చేసిన నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రెపోరేటు పెంచుతున్నట్లు ప్రకటించారు. కాగా, ఆగస్టులో సమావేశంలో కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. ఏప్రిల్‌లో8 సంవత్సరాల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరుకుంది. ఏప్రిల్‌లో ఆర్‌బిఐ అంచనా వేసిన ద్రవ్యోల్బణం 5.7 శాతం కన్నా అధికంగా 6.7 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచినట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ పేర్కొన్నారు. 

ఈ కీలక వడ్డీ రేట్ల పెరుగుదలతో పర్సనల్ లోన్స్,  గృహ వినియోగదారులపై ఇఎంఐ భారం పడనుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధ:గా కట్టే వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. 

Leave a Comment