ప్రజలకు అలెర్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు..!

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్య భారతదేశంపై వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ వైపుగా వీస్తున్నాయి. ఈకారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడనుంది. 

అయితే మహారాష్ట్రలోని విదర్భతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ 3.1 కిలోమీటర్ల ఎత్తున అది ఆవరించి ఉందన అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. 

దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మాస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం(ఆగస్టు 22) కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఉరుములు మెరుపులతో కూడి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుందని చెప్పింది. 

Leave a Comment