ఆత్రేయపురం పూతరేకులకు మరో ఘనత.. పోస్టల్ కవర్ విడుదల..!

పూతరేకులు పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆత్రేయపురం పూతరేకులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పూతరేకులకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ పూతరేకులకు మరో ఘనత సొంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ పోస్టల్ కవర్ రూపొందించింది. 

ఆత్రేయపురం కార్యాలయం వద్ద విశాఖపట్నం రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఈ పోస్టల్ కవర్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఆత్రేయపురం పూతరేకుల పోస్టల్ కవర్ అందుబాటులో ఉండనుంది. ఈ పూతరేకుల పోస్టల్ కవర్ ధర రూ.20 అని పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు తెలిపారు. 

Leave a Comment