వాతావరణ శాఖ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..!

ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఆదివారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోొ రాబోయే రెంండు, మూడు రోజుల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు వర్షాుల పడుతాయని తెలిపింది. ముఖ్యంగా ఆదివారం ఆదిలాబాద్, కొమరం భీమ్, అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలు చోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఉత్తర భారతం నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. 

Leave a Comment