‘క్వార్టర్ అంటే ఎంత?’.. ‘30 ml సార్’.. ఆన్ లైన్ క్లాస్ లో విద్యార్థి ఆన్సర్ కి ప్రొఫెసర్ కోపం చూస్తే..!

కరోనా కారణంగా చాలా రాష్ట్రాలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు కూడా ఆన్ లైన్ క్లాసుల్లో విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు విద్యార్థుల పట్ల ఎంత ప్రభావం చూపుతున్నాయో తెలీదుకానీ.. ఈ ఆన్ లైన్ క్లాసుల్లో జరిగే ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరలై నవ్వులు తెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబైలోని కామర్స్ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో సీఏ ఆన్ లైన్ క్లాస్ జరుగుతోంది. సీఏ ధావల్ పురోహిత్ తో పాటు విద్యార్థులంతా క్లాస్ వింటున్నారు. ఈసందర్భంగా క్లాస్ చెబుతున్న మాస్టర్ ముందుగా మీరు క్వార్టర్ అంటే ఏంటో తెలుసుకోవాలి.. అంటూ పురోహిత్ హెత్విక్ అనే విద్యార్థిని క్వార్టర్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి హెత్విక్ 30 ml సార్ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతే క్లాసు వింటున్న స్టూడెంట్స్ అంతా నవ్వడం మొదలుపెట్టగా.. ఆ మాస్టర్ మాత్రం కోపంతో ఇరిటేషన్ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment