ప్రజల వాహనాలతో కలిసే సీఎం స్టాలిన్ కాన్వాయ్.. తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం..!

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాహితాన్ని కాంక్షించే విధంగా సీఎం స్టాలిన్ పయనం కొనసాగుతోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు స్టాలిన్. ఆయన కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే విధంగా చర్యలు తీసుకున్నారు. 

సీఎం స్టాలిన్ కాన్వాయ్ లో 10 వాహనాలు ఉంటాయి. నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో తన వాహనాలు వెళ్తే ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. దీనిని గుర్తించిన స్టాలిన్ తన కాన్వాయ్ వాహనాల సంఖ్యను సగానికి సగం తగ్గించారు. అంతేకాదు ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్ ని నిలపరు. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కాన్వాయ్ కూడా సాగే విధంగా స్టాలిన్ చర్యలు తీసుకోనుననారు.  

Leave a Comment