మూడు రోజులు భారీ వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..!

తూర్పు మధ్య బంగాళఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడం కారనంగా గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.

ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సగటు సముదర మట్టానికి 5.8 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకొనే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తాలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.   

Leave a Comment