స్టాక్ మార్కెట్ లో నష్టం.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్..!

స్టాక్ మార్కెట్లో నష్టం రావడంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. చిత్తూరు శ్రీనగర్ కాలనీకి చెందిన భరత్(23) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. 

ఉద్యోగం ద్వారా వచ్చిన జీతాన్ని పోగు చేసుకుంటూ వచ్చిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. దురదృష్టవశాత్తూ స్టాక్ మార్కెట్లో నష్టం రావడంతో రూ.లక్ష వరకు పోగొట్టుకున్నాడు. పెట్టిన పెట్టుబడి తిరిగిరాదని నిరాశతో ఆందోళన చెందాడు. దీంతో మంగళవారం ఇంటి నుంచి బెంగళూరు వెళ్లాడు. బుధవారం ఉదయం బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై శవంగా కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు.  

  

Leave a Comment