మాస్కుతో ఆ సమస్య..తప్పించుకోండిలా

కరోనా వచ్చి చాలా మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా కట్టడికి మాస్కు అనేది వాడుకలోకి వచ్చింది. కరోనాను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును విధిగా ధరించాలి. కరోనా మందు వచ్చినా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మాస్కును పెట్టుకోవడం మర్చిపోవద్దు. మాస్కును విధిగా ధరించాలని వైద్యులు సూచించారు. అయితే ఇప్పుడు ఆ అలవాటే మరో ముప్పును తెచ్చిపెడుతోంది. మాస్కును ఎప్పుడూ వేసుకుని ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.

ఎవరైతే మాస్కును ఎక్కువసేపు ధరిస్తారో వాళ్లలో తలనొప్పి, బాడీ డీహైడ్రేషన్ వంటి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిపుణులు వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. ప్రస్తుతం మనలో ప్రతి ఒక్కరూ స్కూలుకు వెళ్లినా కాలేజీకి వెళ్లినా ఆఫీసుకు లేదా ఇతర ప్రదేశాలకు వెళ్లినా కూడా మాస్కులను ధరించి వెళ్తుంటారు.

ఆఫీసులకు వెళ్లిన వారు మాత్రం మాస్కును విధిగా 8 గంటలకుపైనే వేసుకుంటూ ఉంటారు. మాస్కును ఎక్కువగా ధరించిన అమ్మాయిల్లో కొన్ని సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావడం జరుగుతోంది. చాలా మంది అమ్మాయిల్లో తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైతే జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు, స్కిన్ సమస్యలతో బాధపడుతున్నారో వారి మాస్కును ధరించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

బాడీ డీహైడ్రేషన్ కావడం, తలనొప్పి రావడం వంటివి మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తున్నవారిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత, అందరి క్షేమం కోసం మాస్కును వేసుకోక తప్పదు. సాధారణంగా నరాల తలనొప్పి అనేది ఎక్కువ సేపు మాస్కును ధరించడం వల్ల జరుగుతోంది. ఎక్కువ సమయం బిగువుగా ఉండే మాస్కును ధరించకూడదు. మాస్క్ వేేసుకోవడం వల్ల దవడలు కదలడానికి అనుమతించే కండరాలు, కణజాలలను కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది. దాని ప్రభావితం చేసే నరాలు తలనొప్పి వచ్చేలా సంకేతాలు పంపే ప్రమాదం ఉందని తెలుసుకోవాలి. అందుకే మీరు ధరించే మాస్కును ఎప్పుడూ బిగువుగా ఉండకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంచెం లూస్ గా ఉండే మాస్కు ధరించడం ఎంతో ఉత్తమం. ఉదయం నుండి సాయంత్రం వరకు మాస్కు పెట్టుకుని తీసిన తర్వాత దవడలు, బుగ్గలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి రాకుండా ఉంటుంది. దవడలను కదిలిస్తూ మీరు మాస్కు ధరించినంత సేపు నోటిని మూసుకొని ఉంచకుండా చూడాలి. అప్పుడప్పుడు నోటిని తెరుస్తూ ఉండాలి. అదేవిధంగా కొద్ది కొద్దిగా మీ నోటిని తెస్తూ మూస్తూ ఉండాలి. అదే విధంగా దవడలను అటువైపు ఇటువైపు కదలిస్తూ ఉండటం నేర్చుకోవాలి. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఎక్కువ సమయం పాటు ఒకే మాస్కును కూడా ధరించకుండా చూసుకోవాలి. మీరు ఒకసారి మాస్కును వాడిన తర్వాత, తిరిగి దాన్నే ధరిస్తుంటే కచ్చితంగా దాన్ని పూర్తిగా శుభ్రం చేసి, ఉతికిన తర్వాతనే వాడటం ఎంతో ఉత్తమం.

Leave a Comment